పుట:Adhunikarajyanga025633mbp.pdf/252

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మరి యిట్టిస్థితియందు శాసననిర్మాణము సక్రమముగా జరుగుటెట్లు యని కొందరికి సందేహము కలుగవచ్చును. ఏశాసనమైనను ప్రజలకగత్యమగునా? కాదాయని నిర్ణయించుటకు ప్రజాప్రతినిధిసభకంటె హెచ్చుహక్కు సెనేటుసభవారి

రిఫరెండము.

కుండజాలదుగదా! ఆసభకంటెను హెచ్చుశ్రద్ధతో ఏయేశాసనమగత్యమో చెప్పకల్గిన హక్కు ప్రజలకేగలదు. కనుకనే, ప్రజాస్వామిక రాజ్యాంగవాదులు సెనేటుసభను బలపరచుటకుమారు ప్రజాప్రతినిధిసభవారు అంగీకరించు బిల్లులపై ప్రజలయొక్క ఆమోదమునుబొందుటయే మేలని వాదించుచున్నారు. శ్రద్ధతో, ప్రతిబిల్లును తగురీతి చర్చించి ప్రజావసరముల గమనించి తమకుండు రాచకీయయానుభవము ననుసరించి ప్రజాప్రతినిధిసభ వారంగీకరించిన పిమ్మట అయ్యది తమకు ఇష్టమో,కాదో, తెల్పుటకు, ప్రజలసమక్షమందు బెట్టుటకంటె కర్తవ్యమెద్దియు లేదని వారివాదము. ఈవిధానమునే "రిఫరెండము" అని పిల్తురు. కాని, ప్రతిబిల్లును "రిఫరెండమునకు" బెట్టుటవలన అనేక యిబ్బందులుకల్గునని గమనించవలసి యున్నది. ప్రజలకు, తమకు నివేదింపబడినబిల్లుల పరీక్షించి మంచిచెడ్డలతేల్చగల్గిన శక్తి లేకున్నది. వారిరాచకీయపక్షములు, సంఘములు, స్నేహితులెంతగా వారికి సలహానిచ్చినను, వ్యాపారములగూర్చియు, వాణిజ్య వ్యవహారములగురించియు, వివిధనే