పుట:Adhunikarajyanga025633mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వీకరించియున్నది. స్పెయినురాజ్యమునుండి స్వతంత్రతబొందిన పిమ్మట, దక్షిణామెరికాఖండమం దేర్పడిన, రిపబ్లికులన్నియు, తమ ప్రజాప్రతినిధిసంయుతమగు బాధ్యతాయుత రాజ్యాంగముల ననేక మారులు పోగొట్టుకొని, తుదకు, (డిక్టేటరు) 'నిరంకుశనియంత' ల పెత్తనము నంగీకరించుచున్నవి. యుద్ధానంతరము స్థాపించబడిన పోలండు, హంగరీరాజ్యము లందును, ప్రజాస్వామిక రాజ్యాంగమును, ఆవలద్రోచి "నిరంకుశనాయకు" లే రాజ్యపరిపాలనను జరుపుచున్నారు. అటులనే, బల్గేరియా యందును, శ్రీకేరొల్ ప్రభువు నిరంకుశ రాజ్యాంగము నేర్పరచినాడు. టర్కీయందు, రిపబ్లికు యేర్పడినను, శ్రీ ముస్తాఫాకెమాల్‌గారే, రాజ్యాంగమునకు ప్రెసిడెంటుగను, మంత్రాంగసభ కధ్యక్షుడుగను, పార్లమెంటు నందలి అధికసంఖ్యాకులకు నాయకుడుగను వ్యవహరించుచూ, నిరంకుశుడై యున్నాడు. రషియాదేశమునందు, రిపబ్లికు స్థాపించబడినను, బోల్షివిక్కుపార్టీవారు కార్మికులతరపున తమ నిరంకుశ పాలనమును నిలబెట్టుచున్నారు. రిపబ్లికునుబొంది, ప్రజాస్వామిక రాజ్యము ననుభవించుచున్న జర్మనీ దేశమునందే నిరంకుశపాలనమును స్థాపించ నుత్సుకులౌ ""నాజీ" పార్టీవారు క్రమక్రమాభివృద్ధినొంది శ్రీహిట్లరుగారు సంపూర్ణాధికారమును బొందిరి. అన్ని దేశములందును, నాయకులు, రాచకీయజ్ఞులు, కర్మాగారాధిపతులు కొందరు, ప్రజా