పుట:Adhunikarajyanga025633mbp.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ములమధ్యను నిలబడి ఈకాలపు ఆర్ధిక రాచకీయపు టేర్పాటుల, ధర్మసూత్రముల ననుసరించి కొంతవరకు మార్చు టగత్యమని యంగీకరించుచు, దేశపుభాగ్యమును ప్రజలందరి మధ్య పంచుట లాభకరముగాదని వాదించుచు, వాణిజ్య వ్యాపారాభివృద్ధికొరకై అల్పసంఖ్యాకులగు ధనికులు, భూస్వాములు, కర్మాగారాధిపతులు నాయకత్వము వహించి యుండుట లాభకరమును, అవసరమును నని పట్టుపట్టువారు మధ్యపక్షమువారు. వీరినె సెంట్రలుపార్టీయనియు, లిబరలు పార్టీయనియు రాడికలు పార్టీయనియు పిల్చుచుండుట కలదు.

సెనెటుసభయందు లేబరుపక్షమున కేదేశమందును సభ్యతకల్గుట లేదు. అమెరికాయందు లేబరుపక్షము రాచకీయజీవిత మందు లేదనియే చెప్పవలెను. ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్సుదేశములందు, లేబరుపార్టీవారికి సెనేటుసభలలో చాల కొద్దిగా సభ్యత కల్గుచున్నది. కాని మొత్తముమీద అన్నిదేశములయొక్క సెనెటుసభలయందును, కన్సర్వేటివు పక్షీయులే మెజారిటీయందు గలరు. కనుక ప్రజాప్రతినిధిసభయందు, కన్సర్వేటివుపక్షీయులే మెజారిటీ యందుండి, మంత్రివర్గము నేర్పరచి, బిల్లులను ప్రవేశపెట్టుచో, వానినంతశ్రద్ధగా విచారింపకయే సంపూర్ణసుముఖతతో సెనెటుసభ వారంగీకరించు చున్నారు. ఇందువలన కన్సర్వేటివుపక్షమువారు రాజ్యాధికారమందున్నప్పుడు, సెనెటుసభవారు సక్రమ