పుట:Adhunikarajyanga025633mbp.pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముల నిర్మించుటెట్లు? ప్రజల కగత్యమగు బిల్లుల ప్రజాప్రతినిధిసభవారు అంగీకరించినను, ఈసభవారు వానిని నిరోధించి, ప్రజాశయముల భంగపరుపరా? ఈకాలపు ప్రజాస్వామికములందు, ప్రజావసరముల కెంతగానో శాసనసముదాయములు వెనుకబడియుండుటకు, ఈసెనెటుసభవారు ముఖ్యకారకులని చెప్పకతప్పదు.

ప్రతిరాజ్యాంగమందును, ప్రజలెల్లర అధమము మూడుతరగతులుగా తమరాచకీయాభిప్రాయములందు విభజింపనగును. మార్పుల నంతగా గోరక ధనికులప్రభావము నట్లేయుంచి, ఇప్పటివిపరీతపు భాగ్య విభజనపద్ధతిని చెక్కు చెదరకుండ నుంచదలచువారొక పక్షీయులు. వీరినే కన్సర్వేటివులని, కాపిటలిస్టులని, కుడిపక్షమువారని పిల్చుట కలదు. ఈకాలపు భాగ్యవిభజన పద్ధతిని మార్చి, ప్రజా సామాన్యమున కంతకు సమాన ఆర్ధికజీవిత హక్కుల ప్రసాదించి, సాధ్యమైనంతవరకు ప్రజలచే సృష్టించబడుచున్న భాగ్యమును ప్రజలందరిమధ్య సమానముగా, (వారివారి అవసరముల గమనించుచునె) పంచియిడుచు, ప్రజాసామాన్యపుజీవితము కలకలమనునటుల ఆదర్శప్రాయమగునటుల, భాగ్యవంతముగ, సరస్వతి కాలవాలముగ నుండునటుల జేయగోరువారు మరొకపక్షీయులు. వీరినే లేబరుపార్టీ యనియు, సోషలిష్టులనియు పిల్చుట కలదు. ఈ యిరుపక్ష