పుట:Adhunikarajyanga025633mbp.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బిల్లుల పునర్విమర్శనమాత్రముచేయగల్గిన సెనేటుసభవారి చర్యల నంతగా గమనించుచుండరు. ఇందువలన ప్రజాభిప్రాయముననుసరించి ప్రజాభీష్టము నెరవేర్చుటకు ప్రజాప్రతినిధిసభవారాతురతపడునట్లు సెనేటుసభవారు ప్రయత్నించరు. కనుక, ప్రజాశయముల తిరస్కరించి తమకునచ్చిన యేఅల్పసంఖ్యాకులకు లాభకరమగు బిల్లులనో బలపరచుటకు సెనేటుసభవారు సాహసించకలరు. కాని, ప్రజాప్రతినిధిసభవారట్లు చేయజాలరు. అట్లుకాక, ప్రజాప్రతినిధిసభవారుకూడ ఎప్పుడైన ఏకొలదిమందిధనికులకో, భూస్వాములకో, కర్మాగారాధిపతులకో ప్రత్యేకలాభముల కల్గించుబిల్లుల నంగీకరించినచో వానిని సత్వరముగను, సంతోషముగను, సెనేటుసభవారామోదించుట దుస్సాధ్యము. కనుకనే అమెరికాదేశపు సభ్యరాష్ట్రముల శాసనసభలు ప్రజాసామాన్యమునకు నష్ట దాయకమగు శాసనముల నెన్నిటినో అంగీకరించి తమ యధికారముల వమ్ముజేసుకొనెను. ఇందాశ్చర్యమేమియు లేదు. సెనేటుసభవారు ధనికులాదిగాగల అల్పసంఖ్యాకుల కెల్లప్పుడుసుముఖమైయుందురు. ప్రజాసామాన్యపు అధికారములు హెచ్చగుచో ఈసభవారు జాగ్రత్తగా విముఖతజూపెదరు గాని, ప్రజాప్రతినిధిసభవారే తమధర్మముమరచి అల్పసంఖ్యాకులకు లాభములు కల్పింపబూనుకొనుచో ఈసెనేటుసభవారుత్సాహపడుట వింతయేమికలదు?