పుట:Adhunikarajyanga025633mbp.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యింపబడక నిరంకుశులగు న్యాయమూర్తుల యభిప్రాయములపై యాధారపడియుండు దుస్థితితటస్థించుచుండును. ఇంగ్లండునందు స్త్రీలయొక్క ఆస్థిపాస్థిహక్కులు, వైవాహిక విధబంధనపుటేర్పాటులు, తండ్రిలేని బిడ్డలగతి, ఆదిగాగలవిషయములందిప్పటికిని పార్లమెంటు ప్రజలందరిచే కోరబడు శాసనముల నిర్మించకపోవుటచే, ఆదేశస్థులకనేక యిబ్బందులుకల్గుచున్నవి. ఫ్రాన్సునందు ప్రజాసామాన్యమంతయు, స్త్రీలకు వోటుహక్కు ప్రసాదించుటకు సుముఖమైయుండ, శాసనసభలు ఆహక్కును నిరాకరించుచున్నవి. అమెరికాయందిట్లే ప్రజలనేక నూతనవ్యవహారముల పరిష్కార మొనర్చుటకు శాసనములనిర్మింప ఎంతోకాలమునుండి అవసరపడుచుండ, ఆదేశపు రాజ్యాంగవిధానపు చట్టమునకు విరుద్ధమను నెపముపై శాసనసభలా శాసనముల నిర్మింప బూనుకొనకున్నవి. ఇందువలన ఈవిషయములందు, న్యాయమూర్తుల కెంతో నిరంకుశాధికారము సంప్రాప్తమగుచున్నది.

ఈపరిస్థితులందు ప్రజాప్రతినిధిసభ త్వరపడి అనవసరమగు శాసనములనిర్మించునని వాదించుట న్యాయముకాదు. ఐతే ప్రజాప్రతినిధిసభవారు అంగీకరించిన అనేక అనవరరమగు, అన్యాయకరమగు బిల్లులను సెనేటుసభవారు నిరాకరించియున్న దృష్టాంతముల నీ మితవాదులుజూపెట్టుచున్నారు. కాని, సెనేటుసభవారెటులైన నట్టిబిల్లుల తిరస్కరింతురను