పుట:Adhunikarajyanga025633mbp.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లభంగపరచుటకు ధైర్యపడునని వాదించుట ధనికులకు తగునా? ప్రజలం దెవ్వారికైన ఇప్పటి ప్రజాప్రతినిధిసభలపై అసంతృప్తికల్గుటకు కారణమున్నచో వారుప్రజాసామాన్యముకాని, ధనాధికులు కర్మాగారాధిపతులు భూస్వాములు మాత్రముకాదు.

మితవాదులు జూపెట్టు అభ్యంతరములు సెనెటు సభయొక్క యగత్యతను నిరూపించజాలవు. ప్రజాప్రతినిధిసభవారు ప్రజలయందు ప్రజ్వరిల్లుచుండు తాత్కాలికోద్రేకాభి ప్రాయములకు ప్రాధాన్యతనిచ్చి అనవసరమగునట్టివే కాక, అనర్ధదాయకపు బిల్లులనంగీకరించి శాసనములుగా నిర్మించు నేమోయనిగదా వీరిభయము. ఇప్పటికమలులోనున్న ప్రజాస్వామిక రాజ్యాంగములన్నిటియందును, ప్రజలకగత్యమగు శాసనములు తగినంతత్వరితముగా నిర్మితములగుట లేదనియు, శాసనసముదాయము ప్రజాభిప్రాయమునకేగాక ప్రజావసరములకెంతో వెనుకబడియున్నదనియు అనుభవైక వేద్యము. శాసనసముదాయమిట్లు ప్రజావసరములకు వెనుకబడియుండుటవలన ఆశాసనములకు భాష్యముల సిద్ధాంతీకరించి తమ సమ్ముఖమునకు తేబడిన కేసులందు తీర్పు జెప్పుటలో కాలానుగుణమగు ధర్మశాస్త్రముల నిర్వచించుటకు న్యాయమూర్తుల కవకాశముకల్గుటయు, తన్మూలమున ప్రజలయొక్క హక్కుబాధ్యతలు వారికిబాధ్యులగు ప్రజాప్రతినిధిసభవారిచే నిర్ణ