పుట:Adhunikarajyanga025633mbp.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభువులుకూడ, క్రమముగా, ప్రజాప్రతినిధిసభలను స్థాపించి ప్రజలకు తమ ప్రభుత్వముపై, కొంచెము కొంచెముగా, స్వామికమును ప్రసాదించుచున్నారు. కీ|| శే|| మాంటాగూ గారు, మనదేశమునకు ప్రసాదించిన రాజ్యాంగసంస్కరణ చట్టముద్వారా మన భావికాలరాజ్యాంగవిధానమునకు రూపురేఖలు యేర్పరచెను. వానిననుసరించియే భారతావనికిని ప్రజాస్వామిక రాజ్యాంగమే స్థాపితము కానైయున్నది. రౌండు టేబిలు కాన్ఫరెన్సుప్రణాళిక ప్రకారముగను, కాంగ్రెసు యొక్కప్రణాళిక చొప్పునను బాధ్యతాయుత ప్రజాస్వామిక రాజ్యంగమే మనకు తగియున్నట్లు సూచింపబడుచున్నది. ఇప్పటికప్పుడే స్థానిక సంస్థలయందు మనప్రజ లీబాధ్యతాయుత ప్రజాప్రతినిధిసంస్థలకు అలవాటు జెందియున్నారు. మనవలెనే ప్రపంచమందంతట, ప్రజాసామాన్యమేకాక, రాచకీయజ్ఞులును, ప్రజాస్వామిక రాజ్యాంగమే అత్యుత్తమమైనదని యభిప్రాయపడుచుండ, వివిధదేశములందు ఇదివరకున్న నిరంకుశ రాజ్యాంగవిధానముల విడనాడి, ప్రజాస్వామిక రాజ్యాంగ విధానముల స్థాపించుచుండ, ప్రజాస్వామిక రాజ్యాంగము జయప్రదము కాదని, బాధ్యతాయుత ప్రభుత్వసంస్థలు కల్గి యున్న దేశీయులు కొందరు వాదించుచున్నారు. దాదాపు అరువదివత్సరముల పర్యంతము బాధ్యతాయుతప్రభుత్వమును బొందియుండిన ఇటలీదేశము, నిరంకుశరాజ్య పాలనమును