పుట:Adhunikarajyanga025633mbp.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పటినుండి అమలులోనికి వచ్చిన ప్రజాస్వామిక రాజ్యాంగములందు రెండు శాసనసభల నేర్పరచుట రాజ్యాంగ రక్షణమునకై లాభకరమను యభిప్రాయముతో వివిధదేశముల నాయకులు రెండు శాసనసభలను ఏర్పరచుచుండిరి.

శాసనసభలయొక్క ప్రధానధర్మమగు శాసననిర్మాణముగూర్చియె రాజ్యాంగ నిర్మాతలు శ్రద్ధవహించి, శాసననిర్మాణము జాగ్రత్తగా, శ్రద్ధగా, నెమ్మదిగా, శుభప్రదముగా జరుగుటకై ప్రజాప్రతినిధిసభ చాలదను భ్రమచే సెనెటుసభ యగత్యమను యభిప్రాయము బొందుచుండిరి. శాసన నిర్మాణమన్న, ఆదిమకాలమునుండియు వచ్చుచున్న భయము, రాజ్యాంగనిర్మాతల వదలకుండుటచే త్వరపడి ఎప్పుడెట్టి శాసనముల ప్రజాప్రతినిధి సభవారు నిర్మింతురో యను సందియముతో సెనెటుసభను నిర్మించు టగత్యమని వారు తలంచుచుండిరి. ఆధునిక కాలమందు ప్రజల సాంఘి కార్థిక నైతికమత రాచకీయ కట్టుబాటులు, అవసరములు, దినదినమునకు మారుచుండుటయు పెరుగుచుండుటయు; ఆకట్టు బాటుల అవసరముల ననుసరించియె ప్రభుత్వము తన వ్యవహారముల నడపుచు ప్రజల కన్నివిధముల చేయూతనిచ్చుచుండవలెనన్న, ప్రభుత్వపు నియమములు, శాసనములు ఎల్లప్పుడు పునర్విమర్శింపబడుచు పునర్నిర్మాణము బొందుచు దినదిన ప్రవర్ధమానమగు చుండుటయు, అగత్యమని రాజ్యాంగ నిర్మాతలం