పుట:Adhunikarajyanga025633mbp.pdf/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్రిందటిశతాబ్దారంభమునుండియు ప్రశ్నించు చున్నారు. ఆదిమకాలపుగ్రీసు దేశమందొక్క శాసనసభయే చాలియుండ, రోమను రాజ్యమందు సెనెటుసభగూడ యేర్పరుపబడియుండెను. కాని రోమనురాజ్యమందు రాజ్యాధికారముక్రమముగా సెనెటు సభనుండి ప్రజాప్రతినిధి సభవారికి చెందుటవలన రెండు శాసనసభలు తప్పవాయెను. అటులనే ఫ్రాన్సు, ఇంగ్లాండుదేశములందును ప్రప్రధమమునుండియు మూడు శాసనసభలు చిద్రూపము బొందుచుండెను. కొంతకాలమునకు రెండుసభలే స్థిరపడెను. ఫ్రాన్సునందు విప్లవము జరుగువరకు, ఇంగ్లాండునందు 1688 రాజ్యాంగ సంస్కరణములు అంగీకరింపబడువరకు, సెనెటుసభవారికె రాజ్యాంగమందు అధిక్యత సంపాదితమై యుండెను. అమెరికాదేశమందు రాజ్యాంగనిర్మాతలు సమ్మేళన రాజ్యాంగపు ప్రత్యేక సమస్యల పరిష్కారార్థమై (సభ్యరాష్ట్రముల హక్కుల సురక్షితపరచుటకై) రెండు శాసనసభల సమ్మేళనరాజ్యాంగమం దేర్పరచిరి. ఇంగ్లీషువారి రాజ్యాంగవిధానమున కలవాటుజెందిన ఆరాజ్యాంగవిధాన నిర్మాతలు తమ సభ్యరాష్ట్రములందును రెండు శాసనసభలుండుట మేలనితలంచిరి. ఇంగ్లీషువారి రాజ్యాధికారము అమెరికాపై సాగుచున్న దినములందే అనేక రాష్ట్రములందు రెండు సభలుండెను. కనుక సెనెటుసభ నేర్పరచుట రాజ్యాంగనిర్మాతలకు సహజకృత్యముగనే తోచెను.