పుట:Adhunikarajyanga025633mbp.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆధునిక రాజ్యాంగ సంస్థలు.

ప్రథమ ప్రకరణము.

పందొమ్మిదవశతాబ్దారంభమునుండియు, ప్రపంచము నందలి రాజ్యములలో నే రాజ్యాంగమునందైన సంస్కరణలు సాధ్యమైనచో, ఆసంస్కరణలద్వారా, క్రమక్రమముగా ప్రజాస్వామ్యము హెచ్చగుటకే ప్రయత్నములు జరుగుచుండెను. నిరంకుశ రాజ్య పాలనకు లోబడిన, రషియా, పోర్చుగల్, స్పెయిన్, ఆస్ట్రియా, హంగరీ దేశములందును, చైనా, పర్షియా దేశములందును, దక్షిణ అమెరికా రాష్ట్రములందును, బాధ్యతాయుతమగు ప్రజాప్రతినిధిసంయుతమగు సంస్థలే, రాజ్యాంగములందు ప్రాముఖ్యతకు వచ్చుచుండెను. తుదకు, ఈశతాబ్దపుప్రపంచయుద్ధానంతరము, మేర్పడిన స్వతంత్రరాజ్యము లన్నిటియందును, ప్రజాస్వామికరాజ్యాంగ విధానములే స్థాపించబడినవి. మొన్నమొన్ననే (అనగా 1932 జూను, జూలై మాసములందు) "రక్తరహిత విప్లవము" ద్వారా జావాదేశమునకు గూడ ప్రజా స్వామిక రాజ్యాంగ విధాన మేర్పడినది. మనదేశమందలి స్వదేశ సంస్థానపు