పుట:Adhunikarajyanga025633mbp.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు "టనాజమో" అను ప్రజాస్వత్వపు పట్టమును ప్రసాదించవలసివచ్చెను. శ్రీప్రధమఛార్లెసుగారు ఉరిదీయబడిరి. తుదకు 1688 సంవత్సరమందు అంగీకరింపబడిన, ప్రజాస్వాతంత్ర్యముల చట్టముప్రకారము, ప్రజలే తమప్రతినిధిసభద్వారా ఏయేశిస్తుల చెల్లింపసమ్మతింతురో, ఆశిస్తులనే ప్రభుత్వము వసూలుచేయదగుననిరి. ప్రభుత్వమునకు వలయు ధనమును, శిస్తులద్వారా, ప్రజలు చెల్లించుటెట్లో, నాల్గు, ఐదు, పదివత్సరముల కొకమారుగాక, ప్రతివత్సరమును కామన్సు సభవారు నిర్ణయించవలెనని సిద్ధాంతీకరించిరి. ప్రభుత్వము దేశమందు శాంతినెలకొల్పి, విదేశములయొక్క దౌర్జన్యము లేకుండజేయుట కగత్యమగు, రక్షణదళముల నేవిధముగా పరిపాలింపదగునో నిర్ణయించు శాసనమును, ప్రతివత్సరము కామన్సుసభవారు అంగీకరించవలసివచ్చెను. ఇందువలన, ప్రజాప్రతినిధిసభవారి యనుమతిపై, ప్రభుత్వము, రక్షకదళముల సౌష్టతకు, దినఖర్చులకు ఆధారపడవలసివచ్చెను. ఏమంత్రివర్గము, కామన్సుసభవారికయిష్టమో, అద్దానిని, రాజు మార్చువరకు, తిరిగి కామన్సుసభవారి కిష్టమగు మరొక మంత్రివర్గము నేర్పరచువరకు, బడ్జెట్టుశాసనము, రక్షణదళములశాసనమును, ఆసభవారంగీకరింప నిరాకరింతురు. కనుక, ఆసభవారిపై యాధారపడి, ఆదానికి సమ్మతమగు మంత్రివర్గమే ప్రభుత్వమును