పుట:Adhunikarajyanga025633mbp.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గౌరవము పార్లమెంటుచర్యలయందు యిప్పుడు కల్గుట లేదు. ఇతరదేశములందును యిట్లే జరుగుచున్నది.

వార్తాపత్రికలుకూడ వెనుకటివలె ఏదేశమందును శాసనసభావృత్తాంతముల ప్రాముఖ్యతగా సంపూర్తిగా ప్రకటించుటమానినవి. సాధారణప్రజలకు రుచించు ఘోరహత్యలు, కృత్యములు, సముద్రపుటాపదలు, ఆటలుపాటలగురించి ఈకాలపు వార్తాపత్రికలు హెచ్చుశ్రద్ధజేయుచు శాసనసభలందు జరుగు చర్చలగూర్చి క్లుప్తముగా వార్తల దెల్పుచుండుట విచారకరము. ఇంగ్లాండాదిగాగల దేశములందు, శ్రీ లార్డు నార్తుక్లిప్ లార్డుబీపరుబ్రూకు మున్నగు పత్రికాధిపతులు ఇంగ్లాండునందు, శ్రీవాట్ట్సుగారు అమెరికాయందు తమపత్రికలద్వారా రాజ్యాంగవిధానపు కార్యక్రమమును మార్చగల్గునంతవరకు రాచకీయమందు శ్రద్ధవహించుచు, శాసనసభావృత్తాంతముల ప్రచురించుచునేయుండిరి.

ఇంగ్లాండునందు 1760 ప్రాంతమున పార్లమెంటునందొసంగబడిన యుపన్యాసముల ప్రకటించినందులకు శ్రీనిల్క్సుగారిపత్రికలపై ప్రభుత్వము నిరంకుశవిధానమునడుప బ్రయత్నించెను. కాని, పత్రికాస్వాతంత్ర్యమునుకోరు నాయకులే జయమందుటయు, పార్లమెంటుసభా వృత్తాంతముల ప్రకటించు స్వాతంత్ర్యము పత్రికలకు ఆచారణానుగతముగా సంప్రాప్తించుటయు జరిగెను. ఇప్పటికన్ని ప్రజాస్వామిక రా