పుట:Adhunikarajyanga025633mbp.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధికారము లేదాయెను. తుదకు ప్రజాప్రతినిధి సభావృత్తాంతములగురించికూడ ప్రజలు తగినంతశ్రద్ధచేయుట లేదని చెప్పవలసివచ్చుచున్నది. రాచకీయపార్టీలు బలిష్టతజెంది తమతమ రాజ్యాంగ కార్యక్రమ ప్రణాళికలతయారు చేసుకొనుచు తమసభ్యులెట్లు ఏయేచర్చలయం దుపన్యసించ వలయునో తీర్మానించుకొనుట ఇంగ్లాండునం దాచారమగుచున్నది గనుక ప్రజలకు కామన్సుసభయొక్క చర్చలయెడ నానాటికి శ్రద్ధ తగ్గుచున్నది. కాని, వివిధరాచకీయబృందములుగల్గి బృందములసంయోగముచే నిల్పబడు మంత్రివర్గములబొందు ఫ్రాన్సు, జర్మనీదేశములందుమాత్రము ప్రజాప్రతినిధి సభయొక్క చర్చలు ప్రజలదృష్టి నాకర్షింపజాలుచున్నవి. ఇందులకు కారణము వివిధబృందములెప్పుడే విషయములపై ఎఋలెట్లు ప్రవర్తించి వోటుచేయునో, ఎప్పుడేమంత్రివర్గము పడిపోయి క్రొత్తమంత్రివర్గము ఏర్పరచబడునో యనుయాతురత ప్రజలకుకల్గుచుండుటచే శాసనసభా వృత్తాంతములకుత్తరముల జాగ్రత్తగా జరుపుచుందురు. పందొమ్మిదవశతాబ్దమందు ప్రథానరాచకీయజ్ఞు లెల్లరుతమ ముఖ్యోపన్యాసముల ఇంగ్లాండుదేశమందున పార్లమెంటుసమ్ముఖమున యిచ్చెడివారు. ఈశతాబ్దారంభమగుచున్నప్పటినుండి రాచకీయనాయకులు తమ ఉపన్యాసములందెక్కువభాగమును ప్రజల సమక్షమందు బహిరంగసభల యందొసంగుచున్నారు. కనుక, పూర్వము ప్రజలకుండిన