పుట:Adhunikarajyanga025633mbp.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంత్రివర్గపుకార్యక్రమము, భూతకాలపు వర్తనము, వర్తమానకాలపు రాజ్యాంగధోరణి, భవిష్యత్తునకుగల కార్యప్రణాళికలగురించియు, ప్రత్యర్థులయొక్క ఆశయములగూర్చియు, తెలుసుకొనుటకు ప్రజలకుసాధ్యమగుచున్నది.

కాని, మంత్రివర్గము నేర్పరచశక్తి కల్గిన శాసనసభలయొక్క చర్యలగురించియే ప్రజలు సాధారణముగా శ్రద్ధవహించుచుందురు. ఎప్పుడే చర్య పర్యవసానముగా ఏ మంత్రివర్గము పదభ్రష్టతబొందునో, ఏచర్యలద్వారా మంత్రివర్గము బలిష్టతనొందునో లేక, బలహీనతబొందునో తెలుసుకొనుటకు ప్రజలాతురతబడుచుందురు. అమెరికాదేశమందలి, కాంగ్రెసుయొక్క చర్యలను ఇంగ్లాండాదిగాగలదేశముల రాజ్యాంగములందలి సెనేటుసభ వారి చర్చలను ప్రజాసామాన్యమంతగా శ్రద్ధతో గమనించుట లేదు. ఇందులకు కారణము ఆ శాసనసభలందు జరుగుచర్చలయొక్క పర్యవసానముగా ప్రాతమంత్రివర్గము పోవుటకాని, బలహీనతబొందుటకాని, క్రొత్త మంత్రివర్గమువచ్చునట్లు కన్పడుటగాని, లేక వచ్చుటగాని, సాధ్యముకాదు. అమెరికాయందలి ప్రెసిడెంటు ప్రజలచేతనే యెన్నుకొనబడి మంత్రివర్గమును తనంతతానే సెనేటుసభవారి సహకారముతో నేర్పరచుకొనుచున్నారు. ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ ఆదిగాగలదేశములందు, సెనేటునకు మంత్రివర్గముల సృష్టించుటకుగాని, పదభ్రష్టతనొందించుటకుగాని