పుట:Adhunikarajyanga025633mbp.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్యులు, స్వాతంత్ర్యేచ్ఛకలవారలు అధికులు రాచకీయజీవితమునందు జొచ్చుటలేదు.

ప్రజాసేవచేయుట కష్టతర మైనకార్యము. పార్టీల యాధిపత్యమునకు లొంగి, ప్రజల అలవాటులు, అభిప్రాయములగూర్చి విచారించి, రాజ్యాంగవ్యవహారనిర్వహణము గూర్చి చదివి, ఆలోచించి, శాసనసభాసభ్యులుగా వెళ్లువారు అనేకవిధములగు త్యాగములు జేసి కష్టములకు లోనగుచున్నారు. ఇక నట్టివారు లేబరుపార్టీకి చెందినవారగుచో, బీదకుటుంబీకులైనచో దివాలాతీయుట కెంతో కాలముపట్టదు. బీదలు, నిర్ధనులు, కార్మికులు, తమ లేబరుపార్టీ, లేక సోషలిస్టుపార్టీ, లేక కమ్యునిస్టుపార్టీ తరపున తమసంఘములకు జెందిన కార్మికులనే ప్రతినిధులుగా పంపకోరుచో వారికి జీవనభృతి కల్పించుట తప్పనిసరియగును. కనుకనే ఇంగ్లాండునందు 1912 సంవత్సరమువరకు లేబరుపార్టీ వారు తమ యూనియనుల ద్వారా తమ 'పార్లమెంటు' సభ్యులకు గౌరవభృతిని చెల్లించుచుండిరి. కాని శ్రీ ఆస్క్యత్తుగారు ప్రధానమంత్రిగా యున్నప్పుడు ప్రజాప్రతినిధులకు జీవనభృతికల్పించుట రాజ్యాంగ ధర్మమని గ్రహించి, ఒక్కొక్క పార్లమెంటుసభ్యునకు సంవత్సరమునకు నాల్గువందలపౌనులు (రు 5200) గౌరవభృతి నేర్పరచెను. తుద కీ గౌరవభృతికూడ గౌరవప్రదముగా కార్మిక నాయకులుకూడ జీవించుటకు చాల దనుసత్యమును, తిండిచా