పుట:Adhunikarajyanga025633mbp.pdf/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్టీలప్రచారమును సక్రమముగా సాగనిచ్చుటయు, ప్రతిపక్షులయెడ సహనతజూపుటయు నేర్చుకొననిదే రాజ్యాంగపుక్షేమము భద్రపడజాలదు.

VII

అభ్యర్థులు జయప్రదులై, సభ్యత్వమొందుటకై ఎంత యాతురతకల్గియుందురో అటులనే ప్రజలును తమకు సమర్థులును, యోగ్యులును, సద్గుణులునగు అభ్యర్థులు కావలయునని ఆశించి అట్టి అభ్యర్థులు నిలబడుటకై తగుశ్రద్ధ తీసుకొనవలసి యున్నది. తమకు సేవచేయుటకై తమతరపున రాజ్యపాలన మొనర్చుటకై, తమయవసరములదీర్చుటకై అభ్యర్థులు బయలుదేరుచున్నారని ప్రజలు గ్రహించవలసియున్నది. అట్టి వాంఛనీయులగు యభ్యర్థులను, రాచకీయపార్టీలవారు నిలబెట్టుటకు ప్రజలు తగు చర్యగైకొనవలెను. పార్టీలును, సమర్థులగుపౌరులు, స్వార్థత్యాగులగుపౌరులు, అభ్యర్థులుగా నిలబడుట కుత్సాహపడుటకై తగు సావకాశములు కల్గించవలసియున్నది. సమర్థులగు అభ్యర్థులు కొంత స్వతంత్రాభిప్రాయ ప్రకటనాధికారమును కోరుచుందురు. పార్టీ నియమముల నతి కఠినతరముగాచేయుచో యోగ్యులగువారు అభ్యర్థులుగా నిలబడ నిచ్చగించరు. పార్టీ నిరంకుశత హెచ్చగుచో శక్తివంతులగువారు అభ్యర్థులు కాజూడరు. ఇట్టి యిబ్బందులు అమెరికాయందు కల్గుటవలననే వాస్తవముగా శక్తిమంతులు, యో