పుట:Adhunikarajyanga025633mbp.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రజలెల్లరకు సక్రమముగా సంపూర్తిగా తెల్పుటకు సర్వస్వాతంత్ర్యము అవసరము. వివిధరాచకీయపార్టీల కక్షదారుల మధ్య వివాదములు కలుగకుండా వా రొకరొకరిపై దౌర్జన్యముచూపకుండా అన్ని రాచకీయపార్టీలయందు సమానాదరణ జూపుట రాజ్యాంగాధికారమును నడపుప్రభుత్వముయొక్క ధర్మమైయున్నది. యుద్ధానంతరము ఇటలీయందు, ఫ్రాన్సునందు క్రీ. శ. 1932 లో జర్మనీయందు జరిగిన ప్రెసిడెంటు ఎన్నికలు, 'రైష్‌టాగ్‌' ఎన్నికలందు వోటరులు తమలోతాము తీవ్రముగా కొట్లాడుకొని, కొందరిచంపి, అనేకుల గాయపరచి, మరెందరికో ధననష్టము, స్వాతంత్ర్యభంగ మొనర్చుకొనుచుండిరి. అట్టి దురలవాటులు, ప్రజలయందు ప్రబలకుండా తగుశ్రద్ధతీసుకొనుట, రాజ్యాంగపు విధ్యుక్తధర్మము. ఏయేరాచకీయపార్టీల కక్షదారులవలన హెచ్చు అకార్యములు జరుగునో, ఆపార్టీలపై తగు అపరాధముల వేయుట లాభకరము. కాని, జర్మనుదేశపు శ్రీ పెపెనుగారి మంత్రివర్గము జూపినటుల ఏప్రభుత్వమును, ఏయొక్కరాచకీయపుపక్షమందుగాని ప్రత్యేక అభిమానము కన్పరచి, ఆపక్షపు అకృత్యముల గప్పిపెట్టుట రాజ్యాంగపుక్షేమమునకు భంగకరమగును. సక్రమముగా తమతమ అభ్యర్థులు, వారి ప్రచారకులు ప్రవర్తించుకొనుబాధ్యత, ఆయా రాచకీయపార్టీలపై పెట్టవలెను. ఇన్ని జేసినను, ప్రజలు నీతిపరులై వివిధరాచకీయపా