పుట:Adhunikarajyanga025633mbp.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జనసమూహములు, తమ సక్రమాందోళనము, ఈకాలపు పద్ధతుల ననుసరించిజరుప వలయునన్న, లక్షలకొలదిధనమును, ప్రతివత్సరము తమరాచకీయప్రణాళిక ప్రచారమగుటకు తమ కనుకూలు రగు ప్రజలు సంఖ్యహెచ్చుటకు ఖర్చిడవలసి యున్నది. కాన లేబరుపార్టీవారికి తగుధనముచే కూర్చుకొనుటకు తగుసావకాశమును రాజ్యాంగము కల్గించుట ధర్మము. కాననే, ఇంగ్లాండునందు క్రీ. శ. 1927 ఆక్టుప్రకారము కార్మికులసంఘములగు 'ట్రేడుయూనియను'లకు తమ రాచకీయపార్టీనిధికి శాశ్వతచందాదారులుగా చేరదలచుకొన్నవారి నుండి వార వారము వారిజీతభత్యములనుండి పార్టీ వారు నిర్ణయించుచందాను వసూలుచేసుకొనుహక్కు ప్రసాదించబడినది. ఇంకనంతకుపూర్వము ప్రభుత్వసమ్మతిప్రకారము ట్రేడ్ యూనియనులు తమసభ్యులందరిపై రాచకీయచందానువేసి, వసూలుచేసుకొను యధికారము కల్గియుండుటయు, లేబరుపార్టీకి చందా చెల్లింప నిష్టములేని ట్రేడుయూనియను కార్మికులు ప్రత్యేకముగా తమపేరు లీ చందాదారులజాబితా నుండి తగ్గించుకొనవలసియుండుటయు జరుగుచుండెను. ఇట్టిసదుపాయమును తదితరదేశములుకూడ బీదలగు లేబరుపక్షములకు కల్గించుట, స్వరక్షణకు శాంతిభద్రతకు అవసరము.

ఎన్నికలు జరుగుసమయమందు అన్నిపక్షములవారికి తమతమ అభ్యర్థులగూర్చియు, కార్యప్రణాళికలగురించియు,