పుట:Adhunikarajyanga025633mbp.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యక్తిగతమగు లాభములు ఎన్నికల సమయములందు కలుగకుండ జేయుట రాజ్యాంగపు ధర్మము. మనదేశమందు అజ్ఞానులగు నిర్ధనులగు ప్రజల నెన్నిరీతుల అభ్యర్థులు లంచములుబెట్టి అస్వతంత్రుల జేయుచున్నారో అనుభవైక వేద్యమే కదా? ఎన్నికలైనపిమ్మట జయప్రదుడగు అభ్యర్థి తన సభ్యత్వమును పలుకుబడి నుపయోగించి వివిధవోటరులకు కొన్ని సదుపాయముల కల్గించుట అంత సంతృప్తికరము కాకపోయినను దుష్కార్యము కాదు. కాని ఎన్నికలందు మాత్రము దుర్నడతలద్వారా వోటరులయొక్క సర్వస్వతంత్రతను ఏవిధముగానైనగాని, ఎంతవరకైనను, సంకుచిత పరచుట కుపయోగించు కార్యముల నన్నిటి బహిష్కరించుట రాజ్యాంగక్షేమమున కవసరము. ఈరక్షణమార్గమును అన్ని రాజ్యాంగములును అవలంబించుచునే యున్నవి.

ఎన్నికలందు ధనికులకుజెందిన రాచకీయపక్షములు అభ్యర్థులనుండికాని, అభిమానులనుండికాని, కావలసినంత ధనమును సంపాదించి అవసరమగు ఖర్చులను నిర్విచారముగా నడపుటకు శక్తికల్గియుండును. కాని బీదజనులచే నడుపబడుచు కార్మీకులకై స్థాపించబడిన లేబరుపార్టీవా రేదేశమందైనను, తమ యభ్యర్థుల సమర్థించుటకు యెన్నికలయందు తగుప్రచారముచేయుటకు ధనాభావముచే యిబ్బందులుపడుచుండుట గమనార్హము. రాజ్యాంగమం దన్ని రాచకీయపక్షములు; అన్ని