పుట:Adhunikarajyanga025633mbp.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సక్రమముగా నిర్వర్తించునట్లు చేయుటకు తగు చర్యలను తీసుకొనవలసియున్నది.

ఎన్నిక సమయములందు ప్రచారార్ధమై వివిధ అభ్యర్థులు ఖర్చుపెట్టదగు ధనపు మొత్తమును జాగ్రత్తతో నిర్ణయించు టగత్యము. అ మొత్తము మితి మించియుండరాదు. మన దేశమందట్టి నిర్ణయము లేకుండుట పొరపాటు. సైమనుకమీషనువారు మన దేశపు పరిస్థితుల ననుసరించి ఆమొత్తమును నిర్ణయించవలెనని సూచించిరి. యూరపుఖండపు అమెరికా ప్రజాస్వామికములందు ఈ మొత్తముల పరిమాణము నిర్ణయింపబడుచున్నది.

ఈ యెన్నికలందు ఖర్చు చేయదగు ధనమును అభ్యర్థులు వారి రాచకీయపార్టీలు ఏయేవిధముల ఖర్చుపెట్టనగునో ఏయే విధముల ననుసరింపరాదో ఎలెక్షన్ శాసనమందు వివరింపవలసియున్నది. లేనిచో వోటరులకు, వారి ముఠాదారులకు, లంచము లిడుటకు, లేక వోటరులకు భోజనసదుపాయములు కల్పించుటకు, విందులుచేయుటకు నిషావస్తువుల వారికి అందుబాటులో పెట్టుటకు, వారిని మోటారు కారులందు పోలింగుస్టేషనులకు తెచ్చుటకు, తిరిగి పంపుటకు ఉపయోగింపబడుట సాధ్యమగును. రాజ్యాంగాధికారములో నొకహంశమగు వోటును ప్రజలు అమ్ముట అన్యాయమేకాక స్వవినాశనకరమగును. కనుక ప్రజలకు అభ్యర్ధులనుండి యేలాటి