పుట:Adhunikarajyanga025633mbp.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డవలసియున్నది. (రాచకీయపార్టీల కార్యక్రమము బాధ్యతలగురించి వేరొకచో విచారింతము.) తమతరపున సమర్థులును సత్కార్యాచరణులునగు ప్రతినిధుల పంపుకొనవలయునన్న తగు యోగ్యతకల్గిన అభ్యర్థులు నిలబడుటవసరము. ప్రజానాయకులందు కొందరినేరి అభ్యర్థులుగా నిలబెట్టి శక్తిపొందు రాచకీయపార్టీలు తమ యీబాధ్యత సంతృప్తికరముగా నిర్వర్తించునట్లు జేయుట రాజ్యాంగముయొక్క ధర్మము. ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీదేశములం దీవిషయమున చాల యశ్రద్ధజూపబడుచున్నది. 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యపు పద్ధతి నవలంబించు జర్మనీ రాజ్యాంగమం దొక్కొక్క నియోజకవర్గమందు పది ఇరువది ముప్పది అభ్యర్థుల నిలబెట్టుటేకాక దేశమందంతట తమతమ పార్టీలకు సంపాదితమైన స్థానములకు తగు సభ్యుల నిర్ణయించు అధికారము రాచకీయ పార్టీలకు కల్గుచున్నను ఆయభ్యర్థుల నెట్లు నియమించవలెనో నిర్ణయించుటకు శాసనముగాని ప్రభుత్వపు నియమముగాని లేకుండుట విచారకరము. అమెరికాయందిట్లు గాక కొన్ని రాష్ట్రములందు ఏయే నియమముల ననుసరించి రాచకీయ పార్టీల నేర్పరచనగునో ఎట్లెట్లు ఆపార్టీలు తమ అభ్యర్థుల నిశ్చయించుట తగునో నిర్ణయించుచు శాసనములు నిర్మింపబడినవి. అటులనే ప్రతి ప్రజాస్వామిక రాజ్యాంగమందును రాచకీయపార్టీలు తమబాధ్యతలను అందు ముఖ్యముగా అభ్యర్థుల నిర్ణయించు బాధ్యతను