పుట:Adhunikarajyanga025633mbp.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలెనే, స్థానిక స్వపరిపాలనా సంస్థలయొక్క ఎన్నికలలో 1931 సంవత్సరమువర కెన్ని పర్యాయములు బోర్డుల ప్రెసిడెంటులు, మ్యునిసిపలు కౌన్సిళ్ళ చైరుమనులు వివిధ అభ్యర్థులకు సుముఖులగు పోలింగు ఆఫీసరుల నేర్పరిచిరో మనకు తెలిసియే యున్నది. తర్వాత కౌన్సిలు అస్సెంబ్లి యెన్నికలందలి పోలింగు ఆఫీసరులుకూడ వివిధ అభ్యర్థులపరమై విద్యారహితులగు వోటరుల వోటులను 'బాలెట్టు' కాగితముపై వ్రాయునప్పుడెన్నో చోటులందెన్నో మారులు అక్రమములగు పనులు చేయుచున్నారు. ఇట్టి అపకృత్యముల నాపుదల చేయుటకు స్థానికముగానుండు రాచకీయ పార్టీల ప్రతినిధులకు తప్పొప్పులగూర్చి రిపోర్టుచేయుటకు అవకాశము కల్పించుటయు, తప్పొనర్చిన పోలింగు ఆఫీసరుల కఠినశిక్షలకు పాల్జేయుటయు అగత్యము. రిటర్నింగు ఆఫీసరులవిషయమునగూడ నిదే విధముగా జాగ్తత్తపడు టగత్యము.

పాశ్చాత్యదేశములం దెల్లెడల రాచకీయ పార్టీలకు జెందిన అభ్యర్థులుతప్ప తదితర అభ్యర్థులు జయప్రదులగుట దుస్సాధ్యమగుచున్నది, మనదేశమందును కొలది కాలముననె రాచకీయపార్టీలు బలిష్టత నొందనున్నవి. ప్రజామోదము పొందగోరి ప్రజాసేవ చేయ నిచ్చగించు వ్యక్తులు స్వయముగా అభ్యర్థులుగా నలబడుట చాలయరుదగునుగనుక వోటరులందరు తమకగత్యమగు అభ్యర్థులకై రాచకీయ పార్టీలపై ఆధారప