పుట:Adhunikarajyanga025633mbp.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ము, ప్రజలందరి యభిప్రాయముల ప్రకటించుటకు, ప్రజలతరపున మాట్లాడుటకుగలదో, అంతసావకాశము, మహమ్మదీయుడగు సభ్యునకునుకల్గును. శాసనసభయందలి సభ్యులు ప్రత్యేక మెజారిటీ మైనారిటీసంఘముల ప్రతినిధులుగా మెలంగుటకు మారు ప్రజాసామాన్యపు సభ్యులుగా ప్రవర్తించుటకు అవసరముకల్గుటయే కాక వీలునుకల్గును. మహమ్మదీయుడైన సభ్యుడు హిందువుల న్యాయసమ్మతములగు కోర్కెల బలపరచుటకు వీలుకలదు. ఏలనన, తానుతిరిగి ఎన్నికలయందు అభ్యర్ధిగా నిలబడినప్పుడు, సర్వమతములయెడ న్యాయభావము కల్గియున్నందులకు, ఎల్లరు సంతసించి, తనకేతమవోటుల నిచ్చెదరను అభయముకలదు.

మనప్రజల నేవిధముగనైనను, ప్రజాస్వామికమునకు తగకుండునట్లు చేయుటకే బ్రిటిషువారు ప్రయత్నించుచున్నట్లున్నది! ప్రత్యేక సాంఘికనియోజకవర్గములు తమకువలదని స్త్రీలును నిమ్నజాతులును మొర్రపెట్టుకొన్నను, వారికట్టి 'సాంఘిక నియోజకవర్గములనే' ప్రభుత్వము నిర్ణయించుట మనదౌర్భాగ్యము! జమీందారులకొసంగిన ప్రాతినిధ్యతయందుకూడ 'సంఘప్రాతినిధ్యత' మరువకుండుట అభాగ్యము.