పుట:Adhunikarajyanga025633mbp.pdf/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లకు లోనైన మైనారిటీసంఘములు, తాము త్రవ్విన గోతులందు తామే పడిపోయి మైనారిటీ యొడంబడికను జేసికొని, నందకు దాదాపు డెబ్బదిసభ్యత్వములు, ప్రతిశాసనసభయందు, తమకే చెందవలయుననియు, అసౌకర్యముకల్గుటకై పరస్పరముగా సహాయము చేసికొందుమనియు తీర్మానించుకొనిరి. దేశపుటవసరముల మరచి, ధర్మాధర్మముల విచక్షణజేయక, స్వసంఘోద్ధరణయే జాతీయోద్ధరణకంటెను ప్రీతికరమైనదనియు, ప్రాధాన్యమైనదనియు, మైనారిటీ సంఘములు తలంచువరకు, ప్రజాస్వామికమును మనదేశమున ఏర్పరుచుట దుస్సాధ్యమగుటయే కాక, ప్రజాస్వామిక మేర్పడినపిమ్మటకూడ, సుస్థిరముగా నుండుటదుస్తరము.

ఇప్పటి ఆపద్ధర్మము ననుసరించి, రాజ్యాంగవిధానమునకు మూలాధారమగు ధర్మసూత్రము గమనించి, ఎట్టిప్రాతినిధ్య విభజనపద్ధతి సంఘసామరస్యమునకు, ధర్మస్థాపనకు, ప్రజాస్వామిక క్షేమమునకు దోహదము కల్గించును? వివిధ మైనారిటీసంఘములకు, వానియొక్క జనసంఖ్యల ననుసరించి ఎన్నిసభ్యత్వములు, వివిధశాసన సభలయందు రాదగునో లెక్కించి, ఆసభ్యత్వములందు, మూడవవంతువరకు ప్రత్యేక ప్రాతినిధ్యముద్వారా, ఆయాసంఘములకు, కొంతకాలమువరకు (అనగా, సంఘీయులెల్లరు సమానరాజకీయవిజ్ఞానము