పుట:Adhunikarajyanga025633mbp.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్వాంగసౌందర్యము బొందుట వాంఛనీయమైనను, అసలే బిడ్డలు లేక గొడ్రాలైయుండుటకుమారు, తల్లి, కురూపియైన బిడ్డనైన యెట్లువాంఛించునో, అటులనే, సంపూర్ణసలక్షణ సమన్వితమగు రాజ్యాంగము ప్రప్రధమముననే సాధ్యముకాక పోయినచో, తాత్కాలికముగా సాధ్యముకాదగు రాజ్యాంగవిధానమును అంగీకరించుట ఆపద్ధర్మ మందురు. కనుకనే, గాంధిమహాత్ముడు, ప్రత్యేకప్రాతినిధ్యమును తీవ్రముగా నిరసించినను, భారతదేశపుస్వాతంత్ర్యసంపాదనార్థమై, మహమ్మదీయుల ప్రత్యేకప్రాతినిధ్యమే, పరమప్రామాణ్యముగా తలంచి పోరుపెట్టుచున్నందువలన, వారి సహకారమునకై ప్రత్యేకప్రాతినిధ్యము ఆయొక్కమతస్థులకుమాత్రము ప్రసాదించుట కొప్పుకొనెను. కాని, ఒక్కమతస్థులకట్టి ప్రత్యేకపుపు హక్కును ప్రసాదించుటకు, మహాత్ముడొప్పుకొనినంతనే, రాజ్యాంగవిధానపు ధర్మసూత్రములనే అవలంబింపగోరువారి కోటగోడలు విచ్ఛిన్నమగుచున్నవి. ఒక్కమతస్థుల కట్టిప్రత్యేకాధికార మొసంగి, మిగిలినవారికివ్వకుండు టెట్లు? క్రైస్తవులు, యూరపియనులు, సిక్కులు, తాము మైనారిటీయందే రాష్ట్రములందున్నారో, ఆప్రదేశములకుగాను హిందువులు, ప్రత్యేకప్రాతినిధ్యమును గోరజొచ్చిరి. మహాత్ముడీ విపరీత విజ్ఞాపనలకు సమ్మతింపకపోవుటచే స్వకపోలకల్పితమగు కోరిక