పుట:Adhunikarajyanga025633mbp.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విజ్ఞానము, స్వరక్షణశక్తి నొందువరకు, తమకు ప్రత్యేక ప్రాతినిధ్యము నొసంగవలయునని కోరుట కొంతవరకు ధర్మముగా నుండునేమో? ప్రజాస్వామికమునందు, వివిధరకముల ప్రజలచే నిండియుండు సంఘబాహుళ్యపుప్రతిబింబ మననోపు స్త్రీజనసామాన్యమునకు ప్రత్యేకప్రాతినిధ్యము కోరుట సబబుగాదని స్త్రీలే గమనించుటచే, వారినాయకులు, భారతీయమహిళా సంఘముతరపున, 'స్త్రీలకు ప్రత్యేకప్రాతినిధ్యము అగత్యము లేదు' అని లోధియనుకమిటీముందు ఘంటాపథముగా సాక్ష్యమిచ్చిరి. ఇట్టిపరిస్థితులందు, సంఘాంగములగు వివిధమతస్థులకు, జాతీయులకు ప్రత్యేక ప్రాతినిధ్యమొసంగుట న్యాయమా? అవసరమగుచో, పౌరసత్వపు హక్కులందు, వివిధమతస్థులయొక్కయు, జాతీయులయొక్కయు ప్రత్యేక స్వాతంత్ర్యములను, బాల్కనురాష్ట్రములు, జర్మనీదేశముల రాజ్యాంగవిధానపు చట్టములందు జేర్చినట్లు, పేర్కొని, అట్టిస్వాతంత్ర్యముల సముద్ధరణజేయుట రాజ్యాంగపు ధర్మమని నిర్ణయింపవచ్చును.

ఏరాజ్యాంగవిధానమైనను, ఆయాదేశప్రజల యభిప్రాయములు, కోరికలు, అవసరములు ననుసరించియే తన రూపురేఖల బొందుచుండును. సాధారణముగా, సూత్రానుసారము రాజ్యాంగవిధానము సర్వాంగసౌష్టవము కల్గి,