పుట:Adhunikarajyanga025633mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దునా? ప్రజాస్వామికమునకు జీవనప్రాయమగు ప్రజలయందు ప్రజ్వలించవలసిన పరస్పరగౌర వాదరములు, ప్రేమవిశ్వాసములు, ప్రత్యేక ప్రాతినిధ్యమును ప్రసాదించుటవలన వృద్ధిబొందుటకుమారు, సన్నగిల్లవా? స్వరక్షణశక్తిని పొందనివారు ఇతరసంఘములతోబాటు పోటీపడుచు, స్వసంఘోద్ధరణకార్యమునందు నిమగ్నులగుట మేలుకాని, తమయవిటితనమున కెల్లప్పటికి ప్రత్యేకప్రాతినిధ్యమను యూతను చేబూనుచో, స్వరక్షణశక్తిసంపాదన దూరమగుటయు, శాశ్వతపు అవిటితన మేర్పడుటయు అనుభవసిద్ధముగదా?

నిర్ధనికులై, సంఘబలోపేతులుకాజాలక, అసహాయ స్థితియందున్న కార్మికులు, ప్రత్యేక ప్రాతినిధ్యము గోరుచో, కొంతవరకైన సవ్యముగా నుండనోపునేమోకాని, ధనికులు, బీదలచే నిండి నిబిడీకృతమై, సంఘబాహుళ్యమునందు, ముఖ్యాంగములగు వివిధమతస్థులకు ప్రత్యేక ప్రాతినిధ్యము గోరుట న్యాయమా? అవిద్యయందు మున్గితేలుచు, గృహములందె స్వరక్షణశక్తి బొందజాలక, ఆస్థిపాస్థులనుపొందుహక్కుల నింకను సంపాదించుకొనలేక, పురుషులపైననే, తమజీవితాధారమునకై, కాచుకొనియున్న స్త్రీలు, ఎల్లవిధముల పురుషులకంటె యసహాయులై యున్నారు గనుక, తాము పురుషులతోబాటు, సమానరాచకీయానుభవము,