కము జయప్రదమగును కాన, ఎవ్వరును ప్రత్యేక ప్రాతినిధ్యముకోరి, తదితరులజూచిన తమకుకల్గు అపనమ్మకము, భయము ప్రకటించరాదనియు వాదించుచున్నారు. ప్రత్యేకప్రాతినిధ్యము కోరువారును అట్టి ప్రత్యేకసౌకర్యము కొందరికికల్గించుట ప్రజాస్వామికమందు స్వాభావికమైనకార్యము కాకున్నను, ప్రజలెల్లరు పరస్పరప్రేమవిశ్వాసములతో ఒకరితో నొకరు వ్యవహరించుకొనిన, ప్రజాస్వామికము జయప్రదము గాగలదని యొప్పుకొన్నను, వివిధసంఘములవారు రాచకీయరంగమున తమ్ముతాము రక్షించుకొని సంఘజీవితమునకు, తమ ఆత్మగౌరవమునకు, జనసంఖ్యకు, తగినట్లు సేవజేయగల్గుశక్తి బొందువరకు ప్రత్యేక ప్రాతినిధ్యము అగత్యమని మాత్రము వాదించుచున్నారు. కులభేదములచే చీల్చబడుచు కులాభిమానములచే అంగవిహీనముబొందుచున్న హిందూసంఘమునందే బ్రాహ్మణేతరులు అధికసంఖ్యాకులైనను, బ్రాహ్మణులప్రతిష్టజూచి భయమందుచుండ వివిధమతస్థులు పరస్పరముగా ఆచారఆశయములందు అత్యంతముగా భేదించుచున్నంతకాలము, అల్పసంఖ్యాకులగు మతస్థులకు, ప్రజాస్వామికమందు సాధారణ మెజారిటీలపెత్తనముక్రింద తగురక్షణకల్గునని వీరు విశ్వసించుటలేదు. హిందువులందు మహమ్మదీయులకంటె హెచ్చు విద్యావ్యాపక మున్నదనియు, రాచకీయవిజ్ఞానము కలదనియు ఆత్మవిశ్వాసము, స్వరక్షణశక్తి కలవనియు
పుట:Adhunikarajyanga025633mbp.pdf/181
Jump to navigation
Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
