పుట:Adhunikarajyanga025633mbp.pdf/176

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మపద్ధతుల ప్రకారము, ఆర్థిక దాస్యమందున్నప్రజల కెట్లు తగుప్రాతినిధ్యము శాసనసభయందు సంపాదించుటో, పాశ్చాత్యరాజకీయజ్ఞులు సూచించలేదు.

మనదేశమునందు అనుభవసిద్ధమగు విపరీతపరిస్థితులబట్టి మన రాజకీయనాయకులనేకులు, 1919 నందే, ప్రత్యేక పాతినిధ్యసూత్రమును నిర్వచించిరి. దేశీయు లాసూత్రమును మొత్తముమీద నొప్పుకొనిరి. అనగా, వివిధసంఘములు, తమ ప్రతినిధులను, తమసంఘాభిప్రాయముల దెల్పి, తమసంఘావసరములదీర్చి తక్కుసంఘహక్కుల రక్షించుటకు తమ సంఘీయుల జనసంఖ్యననుసరించి ప్రజాప్రతినిధిసభకు ఎన్నుకొనుటకు ప్రత్యేకసదుపాయములజేయు టగత్యమని మనదేశపురాచకీయనాయకులు సమ్మతించిరి. కాని, ఈప్రత్యేకప్రాతినిధ్యపుహక్కును ఏవిధముగా ప్రసాదించుట యను విషయముననే, క్రిందటి పదిసంవత్సరములనుండి తీవ్రతరమగువివాదములు హిందూమహమ్మదీయులు సిక్కు క్రైస్తవుల మధ్యకల్గుచున్నవి. కాని, రాచకీయానుభవము లేని ఆర్థిక సంపదలు లేని సాంఘికాభివృద్ధి బొందనివారికి, వారి జనసంఖ్యకు తగినట్లు ప్రత్యేక ప్రాతినిధ్యము కల్గించవలయునని అంగీకరించినట్లే ! అనాధలగు హరిజనులకుకూడ యీప్రత్యేకప్రాతినిధ్యపు హక్కు ప్రసాదించుటకు, హిందూమహాసభతరపున శ్రీ డాక్టరు మూంజీగారొప్పుకున్నారు. కనుక, ఎన్నికలందుధనికు