పుట:Adhunikarajyanga025633mbp.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తగ్గించుటకై మైనారిటీవారికి తగుప్రాతినిధ్యముకల్గించుటకై, సమిష్టినియోజకవర్గముల నేర్పరచి, వోటరులెల్లరు చదువరులగుటతోడనే, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నమలులో బెట్టుటకు తగుఏర్పాటులు చేసినపిమ్మట, ప్రజలందరియొక్క అభిప్రాయములకు, కోరికలకు, అనుభవములకు, శాసనసభ సంతృప్తికరమగు ప్రతిబింబముకాజాలదా ? పాశ్చాత్యదేశస్థులం దనేకులు అట్టిపరిస్థితులందు, శాసనసభ ప్రజలయొక్క స్వరూపమును సంతృప్తికరముగనే ప్రతిబింబించునని సమాధాన మిచ్చుచున్నారు. కాని, సమిష్టివాదులు, సాంఘికవాదులుమాత్రము, ప్రస్తుతపు ఆర్థికస్థితిగతులందు, దుర్మార్గమగు భాగ్యవిభజనపద్ధతి అమలునందున్నంతకాలము, అనేకులు బీదలై అల్పసంఖ్యాకులు ధనికులైనంతకాలము, నిజమగు ప్రాతినిధ్యము, ప్రజాబాహుళ్యమునకు శాసనసభయందు లభ్యపడదని, తమప్రజల అనుభవచారిత్ర్యములవలన జూపెట్టుచున్నారు. కాని, ఈవిపరీతపరిస్థితులకు, ప్రతీకారము, విప్లవమే నని వారు వాదించుచున్నారు. ఇప్పటికప్పుడే, పదునైదువత్సరములక్రితమే, బోల్షివిక్కులు, రషియాయందు, కార్మికులపెత్తనమును, రాజ్యాంగమం దేర్పరచిరి. కాని, దీనికెదురుగా, ఇటలీయందు ధనికులు, భూస్వాములు, తమ నిరంకుశతనేర్పరచి, ప్రజాసామాన్యమునకు రాదగు, ప్రాతినిధ్యమును దిగమ్రింగుచున్నారు. కాన, యింతవరకు, సక్ర