పుట:Adhunikarajyanga025633mbp.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంతవరకు, సమిష్టినియోజకవర్గములందు "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రము నమలులో పెట్టుటవలన కల్గు సాధకబాధకములగూర్చి విచారించితిమి. మనదేశమునకీసూత్రము నిప్పట్లో లాభదాయకము గాదని తలంచితిమి. కాని, ఏకసభ్యనియోజకవర్గములద్వారా సంభవించుయిబ్బందులు మాత్రమట్లే కల్గుచుండ నూరకుండుట భావ్యముకాదు. ఆ యిబ్బందులతగ్గించి, మైనారిటీ ప్రజలకు, కొంతవరకైన తమ తమ ప్రతినిధుల నెన్నుకొనుయోగ్యత కల్గించుటగత్యము. మైనారీటీవారి కిట్టిసదుపాయమును కల్గించుటకు, సమిష్టినియోజకవర్గము కొంతవరకు సహాయపడును. క్రీ. శ. 1929 నుండి, కౌన్సిలుయెన్నికలందు మనరాష్ట్రమున మనకు కలిగినయనుభవమునుబట్టి, రాచకీయపార్టీ లింకను బలిష్టపడలేదుగనుక, సమిష్టినియోజకవర్గములందు , వివిధరాచకీయపార్టీలకు వివిధసంఘములకు జెందిన అభ్యర్థులు జయప్రదులగుటకు కొంతయవకాశము కలదని రూఢియగుచున్నది. కనుక ఏక సభ్యనియోజకవర్గములకంటె సమిష్టినియోజక వర్గములే ఏర్పరుపదగును.

IV

స్త్రీపురుషభేదముల పాటింపక, ధనికులు బీద లను భేదముల జూపెట్టక, యుక్తవయస్కులగు ప్రజలెల్లరికి వోటుహక్కుయిచ్చుట కొప్పుకొని, మెజారిటీవారి నిరంకుశత్వమును