పుట:Adhunikarajyanga025633mbp.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వోట్లనిచ్చినవారి మూడవరకపువోట్లు ఆరువందలు వచ్చియుండుచో, నాల్గవ అభ్యర్ధియు ఎన్నుకొనబడును. మిగిలిన అభ్యర్ధులెల్లరు, అపజయలుగా ప్రకటింపబడుదురు.

అనగా, ప్రధమసభ్యునకు 5000 మొదటిరకపువోట్లు.

రెండవసభ్యునకు 3000 ప్ర + 2000 (రెం)

మూడవసభ్యుడు 2000 ప్ర + 2000 (రెం)

నాల్గవసభ్యుడు 1500 ప్ర _ 2000 (రెం) + 600 (మూ)


ఈవిధముగా, ఒక్కొక్క అభ్యర్ధికి లభ్యమగు వివిధరకపువోటుల లెక్కించి, జయప్రదులగు వారినామముల, రిటర్నింగుఆఫీసరులు ప్రకటింతురు. ఈలెక్కవేయుట, ఆయాఫీసరుల ధర్మముకనుక, వోటరులకు వానిమర్మముల తెలుసుకొన నగత్యము లేదు. కాని, ఈపద్ధతి జయప్రదముగా సాగవలెనన్న, నమ్మకస్థులగు, న్యాయపాలకులగు రిటర్నింగు ఆఫీసరు లగత్యము. సాధారణమెజారిటీసూత్రము అమలునందున్నప్పుడే, అనేకరిటర్నింగుఆఫీసరులు, మనదేశమందు, దురన్యాయముల జరుపుచుండ 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రము నమలుపరచుటలో నింకెంతకష్టము కల్గింతురో ? యూరపుఖండమందు మొత్తముమీద, సివిలుసర్వీసువారు, మనదేశమందుకంటె హెచ్చునమ్మకస్థులుగా నున్నారు. కాన, ఈపద్ధతివలన ఆదేశస్థులకంతగా ఆపదకలుగ జాలదు.