పుట:Adhunikarajyanga025633mbp.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెవ్వరికట్టి రెండవరకపువోటు లివ్వబడెనో పంచియిడి, వారిలో నెవ్వరు "సభ్యత్వమునకు వలయువోట్లను" సంపాదించగలరో వారిని జయప్రదులుగా నిర్ణయించవచ్చును. అప్పటికిని, కొన్నిస్థానములు ఖాళీగాయుండుచో, సభ్యులుగా నిర్ణయింపబడిన వారికాగితములపై, వోటరులమూడవరకపువోటు లెవ్వరికివ్వబడెనో, కన్గొని వానిని మిగిలియున్న అభ్యర్థులకుకల్పి వారిలో తగినవారిని జయప్రదులుగా ప్రకటింతురు.

నాల్గుసభ్యత్వము లున్నవనుకొందము. మొత్తము, ఎన్నికలందు పాల్గొన్నవోటర్లు 16000 అనుకొందము. కాని ఒక్కొక్కసభ్యత్వమునకు 4000 వోట్లు అవసరమగును. నిలబడినవారిలో, ప్రధమ అభ్యర్థికి 5000 వోట్లువచ్చినవి కనుక, ఆతడు సభ్యుడుగా ప్రకటింపబడును.

అతనికి ప్రధవోటులనిచ్చిన ఐదువేలమందిలో, రెండువేలమంది, మూడువేలు ప్రధమవోటుల బొందిన ఒకఅభ్యర్థికిమరొక రెండువేలమంది రెండువేలఏడువందల ప్రధమవోటూబొందిన అభ్యర్థికి యిచ్చిరనుకొందము. అంతనీరెండవ మూడవ అభ్యర్థులు ఒక్కొక్కరు నాల్గువేలకు మించినవోట్లను బొందుదురు కాన, సభ్యులుగా పరిగణింపబడుదురు. నాల్గవస్థానమున కికనొక్క రగత్యము. మిగిలియున్న అభ్యర్థులలో, అధికవోట్లను (1500 ప్రధమరకపువోట్లు, 2000 రెండవరకపు వోట్లు) బొందినవానికి, జయమందినసభ్యులకు