పుట:Adhunikarajyanga025633mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెట్టుటచే ఆయాజాబితాలలో నుదహరింపబడిన అభ్యర్థులందనేకులనామములు తమకు తెలియకున్నను, తమతమ పార్టీలప్రతిష్టనునిల్పుటకై, వోటరులు జాబితాలవారిగా తమవోటుల నివ్వవలసివచ్చుచున్నది. జర్మనీ, ఒకప్పుడు ఫ్రాన్సునందు కొన్ని అమెరికారాష్ట్రములందు, చెకోస్లావాకియా, స్విట్జర్లాండు దేశములందు, ఒక్కొక్కపార్టీ తనజాబితాల యందు, ఆయానియోజకవర్గముల కొసంగబడు సభ్యత్వము లెన్నియున్నవో అందరే అభ్యర్థులనామములనే కాక, మరికొందరి నామములగూడ జేర్చుచుండును. తన్మూలమున, వోటరునకు, తనపార్టీ అభ్యర్థులం దెవ్వరు ఎట్లెట్లు వచ్చిరో ఆవిధముగా తనసమ్మతిని తెల్పుట కవకాశ మొసంగబడుచున్నది.

ఈవిధముగా, ఎన్నికలు జరిగినపిమ్మట, పోలింగు ఆఫీసరులు పోలింగుపెట్టెలను, 'రిటర్నింగు ఆఫీసరు' వద్దపెట్టగా ఆతడు వోటులను లెక్కించప్రారంభించును. మొదటివోటులబొందిన అభ్యర్థులలో ఎవ్వరికి అత్యథికవోటులువచ్చెనో వారివోట్లు "సభ్యత్వమునకు వలయువోట్లు (Quota)"కు మించుచో వారిని సభ్యులుగా ప్రకటించుచు అట్టిసభ్యులకు తమప్రధమవోటుల నిచ్చినవోటరులు తమ రెండవరకపువోటుల మరికొందరికి యిచ్చియున్నారుగదా ? "సభ్యత్వమునకు వలయువోట్లను" సంపాదించుకొనలేని అభ్యర్థులమధ్య ఎవ్వ