పుట:Adhunikarajyanga025633mbp.pdf/170

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


స్థానములు ఖాళీగాయున్నవో, అందరి నేరి వారిలో, ప్రతి వోటరునకు ప్రప్రధములెవ్వరో, రెండవవా రెవ్వరో అని సూచించుట కష్టతరమైనపనిగాదు.

విద్యావిహీనులగు వోటరులకు, ఇట్టితారతమ్యముల గమనించుట దుర్ఘటమని కొందరు తలంచవచ్చును. గాని, ఇప్పుడెట్లు, ప్రతివోటరును తనకిష్టులగు అభ్యర్థులనామముల, పోలింగుఆఫీసరునకు తెల్పుచున్నాడో, అటులనే తనకు యిష్టులగు అభ్యర్థులను, వరుసవారిగా తెల్పుటకూడ కష్టమైనను సాధ్యమే ? కాని, లోధియనుకమిటీవారు సూచించినట్లు, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్కరంగుపోలింగుపెట్టె నమర్చియుంచి అట్టిపెట్టలయందు, వోటరులు, తమయిష్టానుసారము, తమవోటింగు కాగితముల వేయవచ్చును. ఆపద్ధతి, "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రమునకు జతజేర్చుటకు వీలులేదు. గనుక వోటరులందరు చదువను వ్రాయను నేర్చువరకు, మనదేశమం దీ "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యపుపద్ధతిని ప్రచారమునకుదెచ్చుట లాభకరముకాజాలదు.

ఈ 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యసూత్రానుసారము ఎన్నికలజరుపుచో, చదువను వ్రాయనునేర్చిన వోటరులకు సాధారణముగా, హెచ్చుయిబ్బంది కలుగకపోయినను, కాలక్రమేణ వివిధరాచకీయపార్టీలు, తమతమ యభ్యర్థుల జాబితాలను తయారుచేసి, వోటరుల సమక్షమందు, ఎన్నికలసమయమున