పుట:Adhunikarajyanga025633mbp.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మనము గమనింపవలసినవిషయము. ఎక్కడనైనను రెండవ సభను సృజించుట మిక్కిలి విషయమైనపని. మనదేశములో (Council Of State) కౌన్సిల్ ఆఫ్ స్టేటు ఎట్లువర్తించునో, హిందూదేశపు భవిష్యత్తు ఏరీతిగానుండునో అయ్యది కాల గర్భమందున్నది. కనుక మనకు ఈప్రకరణము చాలముఖ్యము. ఏడవప్రకరణము శాసనసభ అనగా ప్రజలమొదటి సభ (Popular Assemble) ని వర్ణించుచున్నది. (Parties) ఫార్టీలు, పార్టీలయొక్క నిబంధనములు, చట్టములు చేయు పద్ధతులు మొదలగునవి చెప్పబడినవి. తుది ప్రకరణయందు క్రొత్తవిషయముకలదు. కార్మికుల పాలనయందు ప్రభుత్వమే రీతిగానుండవలెనో వర్ణింపబడినది. కొదువవిషయములు రెండవ భాగమున వివరింపబడినవి.

భారతదేశపు భావిరాజ్యాంగపరిణామమును ఆదర్శముగానుంచుకొని సుప్రసిద్ధ ఆంధ్రనాయకులగు ఆచార్య శ్రీ రంగాగారు ఈగ్రంథమున విపులముగా ఆధునికరాజ్యాంగ సంస్థలను విమర్శించిరి. కావున ప్రస్తుతపరిస్థితులలో ఆంథ్రమహాజనులకు రాజకీయవిజ్ఞానము కలుగజేసి భావిరాజ్యాంగ నిర్మాణమున తమకర్తవ్యము గుర్తింపజేయునను యాశతో ఈగ్రంథమును మాజాతీయగ్రంథమాలయందు నాల్గవపుష్పముగా ప్రచురించినారము. మాయుద్యమము నందుగల యభిమానముచే శ్రీరంగాగారిందులకు తోడ్పడినందులకు వారికి