పుట:Adhunikarajyanga025633mbp.pdf/160

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కులు, శ్రీహారల్డులాస్కి మున్నగు రాచకీయజ్ఞులు, ఈపద్ధతి తిరస్కరించుచున్నారు. ఏకసభ్యనియోజకవర్గములుండుచో, సభ్యులు మెజారిటీవోటుపై, ఎన్నుకొనబడుచో, ఏరెండొ, మూడో ముఖ్యమగు రాచకీయపార్టీలే, రాజకీయరంగమున ప్రాముఖ్యత బొందుననియు, బాధ్యతాయుత ప్రభుత్వము, రెండు మూడు బలిష్టమగు రాచకీయపార్టీలుండి, అందొక్కటి, ప్రజాప్రతినిధి సభయందు, మెజారిటీసభ్యుల కల్గియున్ననే, జయప్రదముగా, శుభప్రదముగా నడుపబడుననియు వారు తలంచుచున్నారు. అమెరికాయందును, ఇంగ్లాండునందును, ఏకసభ్య నియోజకవర్గములందు మెజారిటీసూత్రముప్రకారము ఎన్నికల ఫలితములు నిర్ణయింపబడుటవలన, ప్రధానమైన రాచకీయపార్టీలు, రెండుగాను, మూడుగాను నుండుచున్నవి. అమెరికాయందు రిపబ్లికను, డెమోక్రాటికు పార్టీలే ప్రమూఖ్యత వహించియున్నవి. వ్యవసాయకులపార్టీ స్థాపించబడినను, వృద్ధిబొందజాలకున్నది. అటులనే, ఇంగ్లాండునందును, కన్సర్వేటివు, లేబరుపార్టీలు ప్రాముఖ్యస్థానము నాక్రమించుటయు, లిబరలుపార్టీ సాధారణస్థానము బొందుటయు జూడనగును. ఇటుల ప్రధానమగు రెండుపార్టీలు చిరకాలము ప్రాముఖ్యత వహించుటకు ప్రధానకారణము ఏకసభ్య నియోజకవర్గములు, మెజారిటీసూత్రమని చెప్పకతప్పదు. వివిధరాచకీయ బృందములకు మారు, ప్రధానమగురాచకీయ