పుట:Adhunikarajyanga025633mbp.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రకరణములో రాజ్యాంగవిధానపుచట్టము, దానిని మార్పుజేయువిధము, వివిధరాజ్యములలో నేరీతిగానున్నదో వివరముగా తెలుపబడినది. ఇదియునుగాక (Fundamental Rights) ఫండమెంటల్ హక్కులు అనగా పౌరముఖ్యస్వత్వములు పేర్కొనబడిని. మూడవయధ్యాయములో (Separatien Of Powers) శాసనసభలు, మంత్రివర్గము, న్యాయస్థానములు విభజింపబడి వేరువేరుగానుండు అవసరము చర్చింపబడినది. వానివాని పరస్పరసంబంధముకూడ చూపబడినది. నాల్గవదానిలో ఐక్యరాజ్యాంగములు, సమ్మేళనరాజ్యములు వర్ణింపబడినవి. ఐదవప్రకరణము చాలాపెద్దది. ఇందు శాసనసభలు, ఎన్నికలు, వోటింగుపద్ధతులు, వోటర్లబాధ్యతలు, వోటుహక్కును పొందుటకు కావలసిన నిబంధనములు విపులముగా వివరింపబడినవి. ప్రొపోర్షనల్‌వోటింగు పద్ధతి మిక్కిలి విచిత్రమైనదియు నూతనముగా అమలులోనికివచ్చి వృద్ధినిబొంద వలసియున్నదియు గనుక దీనిని అందరును గుర్తింపవలయును. ఇదిగాక శాసనసభ్యులు వారి బాధ్యతలు (Duties), వారు గమనించవలసిన విషయములు మొదలైనవి ప్రతిశాసనసభ్యుడును చదివితీరవలసినవి. ఆరవప్రకరణమందు రెండవశాసన సభ అనగా కౌన్సిల్, సెనేటుసభనుగురించి అనేకవిషయములుగలవు. ఇంగ్లాండు, అమెరికా మొదలగు దేశములన్నిటిలోనుగల రెండవశాసన సభావిశేషములు హిందువులమగు