పుట:Adhunikarajyanga025633mbp.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రచి "ప్రపోర్షనల్" ప్రాతినిధ్యసూత్రములద్వారా సభ్యులనెన్నుకొనుచో, అన్నిపక్షములప్రతినిధులు, ప్రజాప్రతినిధిసభయందు తమతమ ప్రాపకమునకు తగినట్లు సభ్యత జెందగలరని, అనేక రాచకీయజ్ఞులు తలంచుచున్నారు. సంఘమునందలి వివిధమతస్థులు, వివిధ అంతస్థులప్రజలు, వివిధభాషా ఆచార సాంప్రదాయములు కలవారు, వోటుహక్కు బొంది తమతమ ప్రతినిధులనెన్నుకొనుహక్కు లొందుటెట్లగత్యమో, అటులనేవివిధరాచకీయ ప్రణాళికలందు అభిమానముకల్గి వివిధరాచకీయపార్టీలకు జెందినవారికికూడ తమప్రతినిధుల నెన్నుకొనుహక్కు కల్గుటయేకాక, తమసంఖ్యలకు తగినట్లు, తమప్రాపకమునకు తగినట్లు సభ్యతబొందు టగత్యము. ఎన్నటికిని తామెల్లరు మైనారిటీయందే యుండి, తమాభ్యర్థిని జయప్రదుని చేయజాలమనునిరాశబొందిన మైనారిటీ, ఎన్నికలయందు నమ్మకము కల్గియుండజాలదు. కొన్ని నియోజకములందు పలుమారు ఒకేపార్టీకిచెందినవారెన్నుకొనబడుచు, మైనారటీపార్టీవారి కవకాశమే కలుగకుండుచో "మెజారిటీ"వారి నిరంకుశత హెచ్చుటయు, మైనారిటీవారికి ఆత్మవిశ్వాసము తగ్గి, స్వరక్షణశక్తి సన్నగిల్లుటయు తటస్థించును.

కాని, ఇంగ్లీషురాచకీయజ్ఞులనేకులు, 'ప్రపోర్షనల్‌' ప్రాతినిధ్యమన్న విరోధులై యున్నారు. శ్రీ బేజిహటులాయడుజార్జి, రామ్సేమాక్డువాల్డు, మున్నగురాజకీయనాయ