పుట:Adhunikarajyanga025633mbp.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు, మెజారిటీ సంపాదించుకొని, తమయభ్యర్థులనే జయప్రదుల జేయించుకొను యర్హతబొందుచుండుట, ఇంగ్లాండు నందేకాక ప్రజాస్వామికము బొందిన అన్నిదేశములందును, తటస్థించుటచే ఈ 'మెజారిటీ' పరిపాలనయెడ ప్రజలు, నాయకులు, రాచకీయజ్ఞులు సంశయాకులితమానను లగుచున్నారు.

ప్రతినియోజకవర్గమునందును, మెజారిటీ వోటరులే తమ అభ్యర్థిని జయప్రదముగా జేయగల్గుటవలన, రాచకీయపుపార్టీలు స్థిరతగా యేర్పడినపిమ్మట, అనేకనియోజకవర్గములం దనేకమారు లొకేపార్టీకి జెందిన అభ్యర్థులే ఎన్నుకొనబడుచుండుటచే, ఆనియోజకవర్గములందలి మైనారిటీ వోటరులకు, ప్రజాప్రతినిధిసభయందు ప్రాతినిధ్యత కలుగుట దుస్తరమగుచున్నది. దేశమమ్ందంతట నిట్లు, మైనారిటీలకు ప్రాతినిధ్యత లేకపోవుటవలన, వారికధికమగు అన్యాయము కల్గుచున్నదని శ్రీథామసు హేరు, జాన్ స్టూఆర్టుమిల్లుగారలు, క్రిందటిశతాబ్దమందు వాధించిరి. అధికసంఖ్యాకులగు వోటరులే, ప్రజాస్వామికమును నడపు అధికారముబొందుట న్యాయముకాదనియు, "మెజారిటీ పాలనాసూత్రము"ను కొంతవరకు అరికట్టుట అగత్యమనియు, "మైనారిటీ" యందుండు వారికికూడ, తమకిష్టమగు ప్రతినిధుల, ప్రజాప్రతినిధిసభకు పంపుకొను యవకాశము కల్గించుట మేలనియు, వారును ఈకాలపు రాచకీయజ్ఞు లనేకులును వాదించుచున్నారు.