పుట:Adhunikarajyanga025633mbp.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ములు ప్రవేశపెట్టుటకుముందు, వేనిని ముందు ప్రవేశపెట్టనగునో తీర్మానించుట కుపయోగింపబడుచున్నది.

లాటరీపద్ధతి మానినపిమ్మట, ప్రజలు, తమప్రతినిధులను, ఈయాధునికయుగమందు ఇంగ్లాండునందు ప్రధమమున, పిమ్మట ఇతరదేశములందు, అధికసంఖ్యాకులగుప్రజ లేయభ్యర్థిని బలపరతురో, ఆతడు ఎన్నుకొనబడుపద్ధతి యమలులోనికివచ్చినది. దీనినే "మెజారటీ" పైఎన్నిక జరుపుటందురు. ఈమార్గముద్వారా, ప్రతిఒక్కసభ్యనియోజకవర్గము నుండియు, అభ్యర్థులుగానిలబడినవారిలో నెవ్వరిని ఎన్నుకొనుటో స్థిరపరచుట సాధ్యపడుచున్నది. ప్రజలెల్లరికి, తమకు నచ్చిన యభ్యర్థుల నెన్నుకొనుట కధికారమేకాక యవకాశము కల్గుచున్నది. కనుక ఏయభ్యర్థికి, వానితరపున నిలబడువారికి, అదృష్టముపట్టిన, ఆయభ్యర్థి సభ్యుడుగా నెన్నుకొనబడుటయు, ఆతనికి వోటుచేసినవారు సఫలీకృతమనీరధులగుటయు సాధ్యమగుచుండును. వోడిపోయిన అభ్యర్థులు, వారిని బలపరచినవోటరులు, తాము దురదృష్టవంతులమని విచారించి, సంతృప్తిపొందుచుండెడివారు. కాని, కాలక్రమేణ ప్రజలందెచ్చుమంది, ఏరెండో మూడో రాచకీయముఠాలకు లేక పార్టీలకు చెందియుండి, ప్రజలందధిక సంఖ్యాకుల ప్రాపకము పొందుటకై పోటీపడుచున్నకొలది, కొన్నినియోజక వర్గములందు, దేశమందలికొన్ని ప్రాంత్యములందే, ఒకేపార్టీ