పుట:Adhunikarajyanga025633mbp.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఘటనమువలన కల్గు కష్టము లెట్లునివారణ కావలయునో ఆలోచించుటకు, సూచించుటకు హక్కు అవసరము. ప్రజలకు తమవ్యక్తిగతజీవితమందు, సాంఘికవ్యవహారములందు కల్గుచుండు అనుభవమును రాజ్యాంగోపయోగముకై తమ ప్రతినిధులద్వారా అనుదినము ఎల్లవిషయములందును తెలియజేయకల్గు యవకాశ మవసరము. "రాజునకు ప్రజ శరీరమన్నట్లు" రాజ్యమునకు ప్రజలు శరీరము కనుక, ప్రజలయందెల్లశాఖలు, సంఘములు, రాజ్యాంగమున కుపకరించవలయునన్న, వారెల్లరియనుభవముల, ఆలోచనల, రాజ్యాంగవిధానము సక్రమమగుమార్గమున తమ ప్రభుత్వమునకు తెలియునట్లు తమప్రభుత్వముపై యాధిక్యతవహించునట్లు చేయవలసియున్నది. కనుకనే ప్రజాస్వామిక మనుభవించుచున్న, సకలదేశములందును ప్రజలెల్లరికి వోటుహక్కు ప్రసాదించబడుచున్నది. వోటరులెల్లరు తమప్రతినిధులద్వారా తమతమ యనుభవమును, తమకష్టనిష్టూములను, తమకోరికలను ప్రభుత్వమునకు తెలియపరచి, తమకు సుముఖమగు ప్రభుత్వము నేర్పరచుకొను యవకాశము కల్గియుందురు.

III

ప్రజలెల్లరు యుక్తవయస్కు లగుటతోడనే, వోటుహక్కు పొందినంతమాత్రమున వారిప్రతినిధు లెట్లెన్నుకొనబడుట యను ప్రశ్న మనల నెదుర్కొనును. పురాతన కాలమందు మనదేశపు పంచాయతులందును, గ్రీసుదేశమున ఎథె