పుట:Adhunikarajyanga025633mbp.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కొన్నిదేశములలో నూతన చట్టములు శాసనసభల మూలముగా గాక వోటర్లందరిచేతను ఆమోదింపబడవలెను. దీనిని (Referundum) రిఫరెండమ్ అందురు. స్విట్జర్లాండులో నీపద్ధతి అమలులో నున్నది.

ఇంగ్లాండులో నే చట్టమునైనను సాధారణపద్ధతిని మార్పు జేయవచ్చును. కాని అమెరికామొదలగు దేశములలో కొన్ని చట్టములు విశేషవిపరీతపద్ధతిని గాని మార్పు జేయుటకు వీలు లేదు. కేంద్రశాసనసభయును 48 రాష్ట్రములలో నున్న శాసనసభలును కొన్ని పద్ధతులప్రకారము నూతన చట్టమును ఆమోదించవలెను.

ఇట్లు ఎన్ని దేశములు ప్రపంచములోనున్నవో అన్ని చిత్రవిచిత్రమైన భేదములతో ఆయాప్రజలకు, వారిచరిత్రకు, పూర్వాచారములకు సరిపడిన ప్రభుత్వములు అమలులోనున్నవి. ఈపుస్తకములో రాజనీతి శాస్త్రము విపులముగా వర్ణింపబడియున్నది. (Comparative Politics) వివిధ రాజ్యాంగ సంస్థలు సరిపోల్చబడినవి. ప్రతిదేశము యొక్క ప్రభుత్వాంశములును మనహిందూదేశమునకు ఏరీతిగా వర్తించునో పరీక్ష చేయబడినవి.

మొదటిప్రకరణములో ప్రజాస్వామిక రాజ్యమునకు కావలసిన విషయములు వర్ణింపబడినవి. విద్య, ప్రజానాయకులు, మతసామరస్యము మొదలైనవి చెప్పబడినవి. రెండవ