పుట:Adhunikarajyanga025633mbp.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రజాసామాన్యమంతట జాతీయ అవసరములగూర్చి యెట్టియభిప్రాయములు ప్రచారితమైయున్నవో, వానినెల్ల శాసనసభ యందు ప్రకటితమొనర్చుట కవకాశము లుండవలయును. ప్రజాభిప్రాయమును ధర్మసమ్మతముగా, గౌరవప్రదముగా, అందు ప్రతిబింబించవలయును.

కనుకనే యుక్తవయస్సు వచ్చిన ప్రజలందరికి, శాసనసభాసభ్యుల నెన్నుకొను 'వోటు' హక్కు అవసరము. స్త్రీలు పురుషులను భేదము లేకుండా ఎల్లరకు 'వోటు' హక్కు అవసరము. పురుషులకే రాజ్యాంగావసరములు కలవు. స్త్రీలకు లేవని వాదించువారెవ్వరుకలరు ? రాజ్యాంగపు మంచిచెడ్డల వలన పురుషుల కెట్టి సాధకబాధకములు కల్గునో అట్టివే స్త్రీలకును, సమానతీవ్రతతోడనే కల్గుట లేదా ? సంఘనిర్మాణము సౌష్టతనొందకపూర్వము, జనసమూహములు ఒక చోట నుండి మరొక చోటకు తమతమ పశుగణములతో వలసవెళ్లుచుండిన కాలమందు, వివిధసమూహములమధ్య కల్గుచుండు యుద్ధములందు పురుషులే పాల్గొన నర్హులై యుండుటచే రాజ్యాంగమును నిలబెట్టు భారము పురుషులపైననే కలదు. కనుక, స్త్రీలకట్టి రాజ్యాంగవిధానమునందు పెత్తనమిచ్చుట భావ్యముకాదని వాదించుట కొంతవరకు సమంజసమైన కావచ్చునేమోకాని, క్రిందటి యుద్ధపు టనుభవము బొందినపిమ్మట, ఈకాలమందు యుద్ధములు జరుగుచున్నప్పుడు, పురు