పుట:Adhunikarajyanga025633mbp.pdf/143

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లోబడి, పార్లమెంటునకంతకు బాధ్యత వహించుచున్నది. కనుక అమెరికాయందు "కాంగ్రెసు" శాసనముల నిర్మించుటతో తన ప్రధాన ధర్మనిర్వహణము జరిగినదని సంతృప్తిబొందుచుండ, ఇంగ్లాండునందు, శాసనముల నిర్మించుటయేకాక, సక్రమమగు, సంతృప్తికరమగు మంత్రివర్గము నేర్పరచి, నిలబెట్టి మంత్రివర్గముచే ఎప్పటికప్పుడు జాతీయావసరముల సమగ్రముగా, సంతృప్తికరముగా దీర్చునట్లు చేయుభాధ్యత, పార్లమెంటుపై కలదు. క్రిందటిశతాబ్దమందంతట నేర్పరచబడిన, రాజ్యాంగవిధానచట్టములందు అమెరికా కాంగ్రెసును అనుకరించుటకుముందు ఇంగ్లీషువారి పార్లమెంటుపద్ధతిని అవలంబించబడినది. ఇందువలన ఈనాటి ప్రజాస్వామిక రాజ్యములందు, అమెరికా రాజ్యాంగము మినహా, ఇంగ్లీషుపద్ధతి ననుసరించియే శాసనసభకు బాధ్యతవహించు మంత్రివర్గములే యేర్పరచబడినవి. అనగా, శాసనసభకు బాధ్యతవహించు ప్రభుత్వములే యేర్పరచబడినవి.

II

శాసనసభ తన ధర్మములందెద్దానినైన సంపూర్ణముగా నిర్వర్తించవలయునన్నచో ప్రజలయొక్కయు, వారియభిప్రాయముల యొక్కయు ప్రతిబింబముగా నుపకరించవలయును. ప్రజలయందలి అన్నిసంఘములయొక్క ప్రతినిధులు, కొలదిగనో, గొప్పగనో, ఆసభయందు సభ్యత్వము పొందవలయును.