పుట:Adhunikarajyanga025633mbp.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఐదవ ప్రకరణము.

శాసనసభలు

ఈకాలపు శాసనసభలకును పురాతనకాలపు శాసనసభలకును చాలభేదముకలదు. ఇప్పటిసభలయందు ప్రజలు తమంతతామే స్వయముగా సమావేశమగుట లేదు; వానికి తమప్రతినిధుల బంపుచున్నారు. పురాతనకాలమందు, గ్రీసునందును, రోమునందును, పౌరులందరు స్వయముగా తమసభలలో శాసననిర్మాణాది కృత్యములందు పాల్గొనుచుండిరి. ఈకాలపుశాసనసభలు, ప్రతివత్సరము, అనేకనూతనశాసనముల నిర్మించుచునో, అనేక ప్రాతశాసనముల తీసివేయుచునో లేక, మార్పుచేయుచునో శాసననిర్మాణ కార్యమునందు శ్రద్ధజేయుచున్నవి. కాని ఆకాలపుసభలు శాసననిర్మాణమునకు బహుయరుదుగా పూనుకొనుచుండెను. ఇప్పుడు శాసననిర్మాణముజేయుట ప్రతిశాసనసభయొక్కయు, దానిపై యాధారపడు మంత్రివర్గముయొక్కయు ధర్మమని తలంచబడుచుండ, ఆకాలమందు నూతనశాసనముల నిర్మాణమును సూచించువారు ప్రజావిద్రోహులేమోయను సందియము ప్రజలకు కల్గుచుండెను. కనుక, స్వాభివృద్ధినే కోరునాయకులు శాసననిర్మాణకార్యక్రమమును తలపెట్టకుండిరి. ఏథె