పుట:Adhunikarajyanga025633mbp.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాక్రమించుచున్నది. అమెరికా, ఆస్ట్రేలియా రాజ్యాంగములందు, శాసనసభవారి శాసనము లేవిచట్టసమ్మతములో, ఏవిచట్టవిరుద్ధములో నిర్ణయించుయధికారము సుప్రీముకోర్టువారికి కల్గుటవలన, రాజ్యాంగమందు ఈసంస్థయే పరమాధిక్యత సంపాదించుకొనుచున్నది. సుప్రీముకోర్టువారి తీర్పుపై అప్పీలు లేదు. ఆతీర్పు రాజ్యాంగవిధానపు చట్టమునకు టిప్పణముగను, అనుబంధముగను పరిగణింపబడును. ఆతీర్పునకు విరుద్ధమగు శాసనములన్నియు రద్దుకాబడును.

ఐనను జర్మనీయందును, ఆస్ట్రియాయందును సమ్మేళనశాసనసభవారి శాసనములు, చట్టవిరుద్ధములా ? కావా ? యను విచారణచేయుటకు సుప్రీముకోర్టువారి కధికారము లేదు. కనుక, శాసనసభవారే ప్రధానస్థానమా క్రమించ కల్గుచున్నారు. కెనడాయందుకూడా, ప్రీవికౌన్సిలువారికి కొలదిగా మధ్యవర్తిత్వము, సమ్మేళనరాజ్యాంగము, సభ్యరాష్ట్రములమధ్య చేకూరినను, మొత్తముమీద, సమ్మేళనరాజ్యాంగపు శాసనసభయే ప్రధానస్థాన మాక్రమించుచున్నది.



________________