పుట:Adhunikarajyanga025633mbp.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పౌరసత్వపుహక్కులరక్షించుభారము, సమ్మేళనరాజ్యాంగములందు, సుప్రీముకోర్టుపై పెట్టబడుచున్నది. అమెరికా,

పౌరసత్వపు హక్కు
లాక్షేపించువారెవరు?

ఆస్ట్రేలియా, సమ్మేళనములందు, సుప్రీముకోర్టువారు, పౌరసత్వపుహక్కులు, రాజ్యాంగవిధానపుచట్టమందు వివరింపబడువరకు, రక్షించుటకై జాగ్రత్త పడుచుండవలయును. జర్మనీ, దక్షిణాఫ్రికా, కెనడాదేశములం దీబాధ్యత, రాజ్యాంగప్రధానాధికారియగు ప్రెసిడెంటు, లేక, గవర్నరుజనరలుపై పెట్టబడుచున్నది. పౌరసత్వపుహక్కుల రక్షించుభారము రాజ్యాంగ ప్రధానాధికారిపై నుంచబడినంత మాత్రమున, అట్టి హక్కులరక్షణ, సుప్రీముకోర్టువారి భద్రతక్రిందనుండు నప్పటికంటె, తక్కువజాగ్రత్తగా జూడబడుననితలంపరాదు. ఇంగ్లాండునందు, 'హబీసుకార్పొసు' ఆక్టును, తాత్కాలికముగా అరికట్టవచ్చునేకాని, రూపుమాపుట కేపార్లమెంటునుసాహసించదు. అటులనే జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా, కెనడా దేశములందును, ప్రజలందరిచే ప్రేమింపబడు పౌరసత్వపు హక్కుల నపహరింప నేప్రభుత్వమును పూనుకొన సాహసింపదు. అధవా, ప్రభుత్వములట్టి యక్రమకార్యమునకు దొరకున్నను, శాసనసభలు, వానిని ధిక్కరించును. తుదకు ప్రభుత్వము, శాసనసభలు, పౌరసత్వపుహక్కుల దిగమ్రింగగోరుచో, ప్రజలు వారిని పదభ్రష్టతజేయుటతప్పదు. ఇట్టి అసా