పుట:Adhunikarajyanga025633mbp.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


స్వతంత్రముబొందుటకు, వారందరు ఐక్యమొందిననే కాని లాభములేదని తలంచి, తమతమ ప్రత్యేక వ్యక్తిత్వముల నాపుదలచేసి, అందరి కొకేరాజ్యాంగము నేర్పరచుకొనిరి. కావున, సమ్మేళనరాజ్యాంగమే వివిధజాతులకు చెందిన ప్రజలకు శరణ్యమనుటకు వీలులేదు.

ఆయారాజ్యముల చరిత్రలననుసరించి వానినన్నిటి సమ్మేళనమందు జేర్చిన, సాముదాయకలాభములు హెచ్చగునో, లేక ఐక్యరాజ్యమందు జేర్చిన ప్రజలందరిశ్రేయము అభివృద్ధిబొందునో, విచారించు టగత్యము. సమ్మేళనమందు జేరుటకు వివిధజాతులకు, వివిధభాషాయుక్తప్రజలకు, వివిధనాగరికతాస్థితిగతులందున్నవారికి లాభకరము. ఒకేజాతికి జెందియుండి, --------- భాషనే కల్గియుండి, ఒకేసాంప్రదాయముల బొందియుండు ప్రజలు, ఒకేచారిత్రకానుభవ సంపదను కల్గియుండుచో, ఐక్యరాజ్యాంగమందు చేరుటలాభకరము.

ఐక్యరాజ్యాంగమందు స్థానికవ్యవహారములను సక్రమముగా, సంతృప్తికరముగా నెరపుటకు ప్రధానప్రభుత్వపు సంస్థలకు సులభసాధ్యముకాదు. కాని, ఐర్లాండునందును మనదేశమునందువలెనే స్థానికస్వపరిపాలనాసంస్థల స్థాపించుట లాభకరము. కాని వీనికి ఫ్రాన్సు, జర్మనీలందువలె, అమితముగా సంకుచితపరుపబడిన యధికారములిచ్చుటవలన లాభ